Mehreen: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి మెహ్రీన్ 1 y ago
తిరుమల శ్రీవారిని సినీ నటి మెహ్రీన్ కౌర్ పిర్జాదా దర్శించుకున్నారు. శనివారం వేకువ జామున శ్రీవారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.